అధికారపార్టీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ భారీగా ఏర్పాట్లు
తరలిస్తున్న పందెం రాయుళ్లు, ప్రజలు గ్రామాల్లో సంక్రాంతి సందడి
వణుకూరు(పెనమలూరు) : సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహించరాదన్న హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వణుకూరు గ్రామంలో కోడి పందేలు నిర్వహించటానికి టీడీపీ నేతలు శిబిరం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడు రాష్ట్ర ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు కాసరనేని మురళీ ఆధ్వర్యంలో ఇక్కడ కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలు నిర్వహించటం చర్చనీయంగా మారిం ది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు ఈడుపుగల్లులో నిర్వహిస్తున్న కోడి పందేలకు ధీటుగా టీడీపీలో మరో గ్రూపు ఇక్కడ పందేల నిర్వహణకు ఏర్పాటుచేశారు. పందెంరాయుళ్లకు, పందేలు చూసేందుకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేశారు.
కంకిపాడు : మండలంలోని ఈడుపుగల్లు గ్రామ శివారు పంట పొలాల్లో సంక్రాంతి కోడి పందేలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఓ వైపు కోర్టు ఆదేశాలు ఉన్నా పందేలు బహిరంగంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమక్షంలో కోడి పందేలు ఆరంభమయ్యాయి. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పందెంరాయుళ్లు, జూదరులతో ఈడుపుగల్లు పందేల బరి కిటకిటలాడింది. బాహాటంగానే కోత ముక్క, కాయ్‌రాజా కాయ్, నిర్వహించారు. బుధవారం ఒక్క రోజే లక్షలు చేతులు మారినట్లు అంచనా. పందేలను ఎంపీపీ దేవినేని రాజా పర్యవేక్షిస్తున్నారు.
బరిలోకి దిగిన కోళ్లు
Published Thu, Jan 14 2016 12:23 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement