విజయవాడ: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు బుధవారం నుంచి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో జరగనున్న తొలి విడత కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు మంగళవారం తెలిపారు. మార్చి 1న నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8,992 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 1,860 సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.
ఇందులో 1,193 సీట్లు నాన్‌సర్వీస్ అభ్యర్థులకు, 667 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయించినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 9 గంటల నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. తొలి రోజు జరిగే కౌన్సెలింగ్‌కు ఒకటి నుంచి 800 ర్యాంకుల వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 1 నుంచి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు మే 15లోగా ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు పోందాలని, 16న చేరాలని సూచించారు.
నేటి నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్
Published Wed, Apr 29 2015 3:16 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement