వేసవిలో ఆరోగ్యం జర జాగ్రత్త..! | Summer Tips For Children And elders | Sakshi
Sakshi News home page

వేసవిలో ఆరోగ్యం జర జాగ్రత్త..!

Published Thu, Mar 22 2018 12:42 PM | Last Updated on Thu, Mar 22 2018 12:42 PM

Summer Tips For Children And elders - Sakshi

నిడమర్రు : వేసవి కాలం వచ్చింది, తనతోపాటు వడగాడ్పులు, దాహం, నీరసం తీసుకువస్తుంది. వీటితో చిరాకు, మరింత నీరసం. పగలంతా భానుడు నిప్పులు చెరుగుతాడు. ఆ ఎండలకు ఒకటే ఉష్ణోగ్రతోపాటు పగలు సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవి కూడా చల్లగా ఆస్వాదించవచ్చంటున్నారు వైద్యులు.

ఆహార పదార్థాల్లో నూనె తక్కువగా వాడాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
ఉదయం పూట అల్పాహారంలో నూనె వంటకాలు కాకుండా, ఆవిరి కుడుములు, ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి
కర్బూజాలు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్‌ ఏ, డీ శరీరానికి ఎక్కువగా అందుతాయి.
శీతల పానీయాల కన్నా కొబ్బరి నీళ్లు చాలా మంచిది. కాఫీ/టీలకు వీలైనంత దూరంగా ఉండాలి.
కిటికీలకు గుమ్మాలకు వట్టివేళ్ల తెరలని తడిపి కర్టెన్స్‌ మాదిరిగా కట్టుకుంటే వేడిని ఇంటిలోకి రానివ్వకుండా చల్లదనం ఇస్తుంది.
సాధారణంగా పిల్లలు వేసవి సెలవుల్లో ఎండలోకి వెళ్లి ఆటలు ఆడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని అలా ఎండలోకి వెళ్లనీయకుండా ఇండోర్‌ గేమ్స్‌ ఆడించాలి.
పలుచని మజ్జిగలో కాసింత నిమ్మరసం, ఉప్పు కలిపి పల్చగా కలిపి పిల్లా పెద్దా అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
వేసవిలో బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా ఇంట్లో అన్నిరకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్‌లు చేసుకొని తాగేలా శ్రద్ధ వహించాలి.
పిల్లలకు మజ్జిగ కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాసిన నీళ్లు తాగించడం అలవాటు చేయాలి
పెద్దలు, పిల్లలు గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఒక స్పూన్‌ పంచదార కలిపి ఓఆర్‌ఎస్‌ ద్రావణంలా కలిపి తాగితే మంచిది.
తాటి ముంజులు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు కంటికి సన్‌గ్లాసెస్, తలకు టోపీ ధరించాలి.
వయసు 50 దాటిన వారు తమ ప్రయాణాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ వెంట తీసుకుని వెళ్లాలి.
ఒకవేళ వివిధ ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే మాత్రం ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవ్వకండి.
గుండె సంబంధిత వ్యాధులు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్య రశ్మికి బహిర్గతం అవ్వడం వల్ల త్వరగా డీ హైడ్రేషన్‌కు గురై ఆ వ్యాధి తీవ్రతలు అధికమవుతాయి.
వేసవికాలంలో శరీరానికి అతుక్కుని బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు. వదులుగా కాటన్‌తో తయారు చేసిన బట్టలు ధరించాలి. దీనివల్ల మీ శరీరానికి గాలి తగిలి డీహైడ్రేషన్‌ జరిగే అవకాశం తగ్గుతుంది.
మద్యపానం, సిగరెట్, కార్బొనేటెడ్‌ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటిని సేవించడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి.
వేసవికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మంచినీటి బాటిల్‌ తప్పకుండా తీసుకుని వెళ్లండి.
వేసవిలో కొబ్బరి బొండాం ఆరోగ్య ప్రదాయిని. కొబ్బరి బొండాలు కాస్త «ఖరీదైనా తర్వాత ఆస్పత్రి మందుల ఖర్చుతో పోల్చితే వీటికి పెట్టే ఖర్చు తక్కువే.
కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరికి చేరవు.
కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్‌ కలుపుకుని తాగితే వేసవి బడిలక నీరసం చాలా త్వరగా తగ్గుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement