కాంగ్రెస్ అధిష్టానంతో 'వారు' టచ్లో ఉన్నారు | T.TDP Mlas keep in touch with congress high command, says Mla Bikshamaiah goud | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అధిష్టానంతో 'వారు' టచ్లో ఉన్నారు

Published Sat, Sep 21 2013 2:13 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

T.TDP Mlas keep in touch with congress high command, says Mla Bikshamaiah goud

తెలంగాణ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఆ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లోనే ఉన్నారని తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామన్నారు. అందుకోసం రేపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా న్యూఢిల్లీ వెళ్తున్నట్లు భిక్షమయ్య గౌడ్ వివరించారు. అయితే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఒప్పుకునేది లేదని భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చానంటున్న చెప్పుకుంటున్న బాబు పెద్ద దొంగ అని ఆయన అభివర్ణించారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఇరుప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలను తీసుకువెళ్లడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని భిక్షమయ్య గౌడ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement