స్వైన్‌ఫ్లూతో ‘గాంధీ’లో ఇద్దరు మృతి | To States' gandhilo killed | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో ‘గాంధీ’లో ఇద్దరు మృతి

Published Sun, Jan 18 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

To States' gandhilo killed

సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ లక్షణాలతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు శనివారం సాయంత్రం మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు ఏఎస్‌రావునగర్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు. కాగా, నగరంలో మరో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 10 మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు.
 
మహబూబ్‌నగర్ లో 14 మందికి....

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాను స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 14మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. శుక్రవారం ఈ వ్యాధి బారిన పడిన వారిలో మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న విజయలక్ష్మి, ఆమె కూతురు రచన ఉన్నారు. వీరితో పాటు న్యూటౌన్‌కు చెందిన కృష్ణ, మల్దకల్‌కు చెందిన గోవర్దన్ రెడ్డికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారు. శనివారం వ్యాధి బారిన పడిన వారిలో మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్‌నర్సు ప్రమీల, ఆమె భర్త ప్రభాకర్‌తో పాటు అదే పట్టణానికి చెందిన శ్రీను, వెంకటేశ్‌లకు కూడా వ్యాధి సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement