=జిల్లాలో 104 వీఆర్‌వో, 188 వీఆర్‌ఏ పోస్టులు
=ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
=ఫిబ్రవరి 2న రాత పరీక్ష
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్‌వో (గ్రామ రెవెన్యూ అధికారులు), వీఆర్‌ఏ(గ్రామ రెవెన్యూ సహాయకులు) పోస్టులకు జేసీ బసంత్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీఆర్‌వో పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు.
వీఆర్‌ఏ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష రుసుముగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలని సూచించారు. వికలాంగ అభ్యర్థులకు ఫీజు రాయితీని ప్రభుత్వం కల్పించిందన్నారు. పరీక్ష రుసుం చెల్లింపునకు చివర తేదీ జనవరి 12 అని తెలిపారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌ను పొందవచ్చన్నారు.
పోస్టులు ఇలా
జిల్లాలో 104 వీఆర్‌వో, 188 వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జేసీ తెలిపారు. వీఆర్‌వో పోస్టుల్లో 36 ఖాళీలను మహిళలకు కేటాయించామన్నారు. వీఆర్‌ఏ పోస్టుల్లో 50 శాతానికిపైగా మహిళలకు కేటాయించినట్లు వివరించారు. మరిన్ని వివరాలను http://ccla.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఒంగోలు శేషయ్య పాల్గొన్నారు.
వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Published Sat, Dec 28 2013 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement