కమలాపురం: వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లె గ్రామంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చి ఆపై బావిలో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.