వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.