బాబోయ్ ఇవేమి సభలు | What is this meetings | Sakshi
Sakshi News home page

బాబోయ్ ఇవేమి సభలు

Published Wed, Sep 30 2015 3:27 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

బాబోయ్ ఇవేమి సభలు - Sakshi

బాబోయ్ ఇవేమి సభలు

చల్లపల్లి : సీఎం సభలు అంటేనే అధికారులు బెంబేలెత్తుతున్నారు. రాజధానికి దగ్గరలో ఉన్న అధికారులైతే సభలకు జనాలను ఎలా తరలిం చాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. రెండు వారాల వ్యవధిలో ప్రభుత్వం నిర్వహిం చిన రెండు సభలకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

 జనసమీకరణకు ఇబ్బందులు
 ఈ నెల 16న ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద కృష్ణాగోదావరి నదుల అనుసంధాన ‘సంగమ’ సంబరాలు, విజయవాడలో మంగళవారం రైతన్న కోసం చంద్రన్న కార్యక్రమానికి జనసమీకరణ చేసేందుకు అధికారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు సాగుతున్న తరుణంలో డ్వాక్రా మహిళలు, రైతులకు మాయమాటలు చెప్పి సభలకు తరలించాల్సి రావడం కత్తిమీద సాముగా మారింది. ఏదో విధంగా భయపెట్టి సభలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న అధికారులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకష్టపడినా ప్రజలు ముందుకు రాక బస్సులు ఖాళీగానే వెళ్తున్నాయి.

స్థానిక టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమపై ఎలాంటి ఫిర్యాదులు చేస్తారోనని తక్కువ మంది జనసమీకరణ చేసిన అధికారులు భయపడిపోతున్నారు. గతంలో ఇలాంటి సభలకు జనసమీకరణ బాధ్యత రాజకీయ నాయకులకే అప్పగించేవారు. ఇప్పుడు అధికారులకు అప్పగిస్తున్నారు. రెండువారాల వ్యవధిలో రెండు సభలు నిర్వహించడంతో ఇవేమి తి ప్పలు బాబోయ్ అని అధికారులు బెంబేలెత్తి పోతున్నారు.

వచ్చేనెల 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీగుంటూరు జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ జనసమీకరణ ఉంటుందనే నాయకులు మాటలు ఇప్పటి నుంచే అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల ఇలాంటివి నెలకు ఒకటి రెండు ఉంటాయని టీడీపీ నాయకులు పేర్కొంటుండటంతో అధికారులకు కంటిమీద కునుకు కరువైంది. ‘సంగమ’ సంబరాలకు అవనిగడ్డ నుంచి 35 బస్సులు, రైతన్న కోసం చంద్రన్న కార్యక్రమానికి 20 బస్సులను తరలిం చారు. రూట్ బస్సులు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 బస్సులు లేక ప్రజలు అగచాట్లు
 విజయవాడ : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన రైతు కోసం చంద్రన్న కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు, రైతులను అధికారులు తరలించారు. ఇందు కోసం ఆర్టీసీ రెగ్యులర్ రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేసి, సభకు జనాన్ని తరలించేందుకు పంపారు. జిల్లా వ్యాప్తంగా 180 బస్సులను అన్ని నియోజకవర్గాలకు పంపారు. విజయవాడ నగరంలో 80 సిటీ సర్వీసులు, జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట తదితర బస్సు డిపోల నుంచి వంద బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఆర్టీసీ బస్సులను వ్యవసాయశాఖ కార్యాలయాలకు పంపారు. వ్యవసాయ అధికారులు వాటిని ఉదయం 7 గంటలకు గ్రామాలకు పంపారు.

ప్రతి గ్రామం నుంచి రైతులను బహిరంగ సభకు తరలించారు. ఆయా రూట్లలో బస్సులు లేక సాధారణ ప్రయాణికులు నానా అగచాట్లుపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభలకు జిల్లా యంత్రాగం బస్సులకు కేటాయించింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం స్పెషల్ సర్వీసుగా పడిపే ప్రతి బస్సుకు రోజుకు రూ.10 వేల వరకు చెల్లించాలి. అయితే నాలుగు సార్లు బస్సులను కేటాయించినా సంస్థ ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమపడలేదని అధికారులు చెపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement