భువనగిరి, న్యూస్‌లైన్: పేలుడు పదార్థాల, రసాయనాల కంపెనీల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. హైదరాబాద్ శివారులో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కంపెనీ యాజమాన్యాలకు కంపెనీల నుంచి ఇన్సూరెన్స్ అందుతుండగా కార్మికులకు మాత్రం అందడం లేదు. దీంతో ఆ కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి. తాజాగా భువనగిరి పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు గాయపడ్డారు.
ఎక్కువగా రసాయన, పేలుడు పదార్థాల కంపెనీలు..
జిల్లాలో సుమారు 60 వరకు రసాయన, 6 వరకు ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా భువనగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడలతో పాటు యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, ఆలేరు, బొమ్మలరామారం మండలాల్లో అధికంగా రసాయన, పేలుడు పదార్థాల కంపెనీలు ఉన్నాయి.
వీటిలో సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా కంపెనీలను సంబంధిత అధికారులు తనిఖీలు చేసి నిబంధలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కి నైపుణ్యం లేని కార్మికులతో పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అమ్యామ్యాలకు అలవాటు పడడంతో తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. విధి నిర్వహణలో కార్మికులకు భద్రత కోసం హెల్మెట్, షూష్ , గ్లౌజ్‌లు, మాస్క్ పరికరాలు ఇవ్వాల్సి ఉం టుంది. కాని చాలా కంపెనీల్లో అవి మచ్చుకు కూడా కన్పించడంలేదు. దీని వల్ల కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడుతూ, మృత్యువాత పడుతున్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో భువనగిరి డివిజన్‌లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నా ఏ కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
కార్మికుల ప్రాణాలు గాలిలో!
Published Wed, Sep 11 2013 5:00 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement