పెరుగుతున్న చైన్‌స్నాచింగ్‌లు
బైక్‌ల చోరీలూ ఎక్కువే
బ్యాంకుల్నీ వదలడం లేదు
పోలీసులకే చెమటలు పట్టిస్తున్న దొంగలు
2014 జూలై 22: చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలో వనజ రాత్రి ఏడు గంట లకు ఇంటి వద్ద ఆరుబయట నడుచుకుంటూ వెళుతోంది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 104 గ్రాముల బంగారు గొలు సు లాక్కెళ్లారు. ఈ ఒక్క వారంలోనే నగరంలో నలుగురు మహిళల నుంచి 171 గ్రాముల బం గారు ఆభరణాలను తెంపుకెళ్లారు.
ఆగస్టు 13: చిత్తూరు చర్చీవీధిలో సురేష్ హీరోహోండా వాహనాన్ని పార్కింగ్ చేసి అంగట్లోకి వెళ్లాడు. 15 నిముషాల తరువాత వచ్చి చూస్తే బైక్ మాయం. దీనిపై స్థానిక సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నవంబర్ 15: వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏకంగా 13 కిలోల వెండి వస్తువు లు, 750 గ్రాముల బంగారు ఆభరణాలు దోపి డీ చేసి పోలీసులకు పెద్ద సవాలు విసిరారు.
చిత్తూరు (అర్బన్): ఇలా జిల్లాలో చోరీలు మితిమీరుతున్నా యి. ప్రధానంగా చైన్‌స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువ అవుతున్నాయి. బ్యాంకు దోపిడీలు పోలీసులకు కంటిమీద కునుకు లే కుండా చేస్తున్నాయి. చైన్‌స్నాచింగ్ సమయాల్లో హుఖాలకు హెల్మెట్ వేసుకోవడం, కర్చీఫ్ కట్టుకోవడం పాత పద్ధతి. ఇటీవల జరిగిన చైన్‌స్నాచింగ్ కేసు ల్లో నిందితులు ఓ వృద్ధురాలి మెడలోంచి చైను తెంపకుండా తీరిగ్గా తలపై నుంచి తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోయారు. నిందితులు 30 ఏళ్ల వయస్సు మధ్య ఉంటారని బాధితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. బ్యాంకు దోపిడీ లు సినిమా ఫక్కీకి ఏ మాత్రం తీసిపోవడంలేదు. వరదయ్యపాళెం బ్యాంకు దోపిడీలో ఆవరణలోకి ప్రవేశించగానే దుండగులు సీసీ కెమెరాల వైర్లను కత్తిరించడం, కిటికీలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించేప్పుడు అడ్డుగా తెరను కట్టడం పోలీ సుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దోపిడీ మొ త్తం పూర్తయిన తరువాత ఒక్క చోట కూడా నిం దితుల వేలిముద్రలు దొరకలేదు. పోలీసు జాగిలాలు వాసన పట్టకుండా బ్యాంకు పరిసర ప్రాంతాల్లో మొత్తం కారంపొడి చల్లి మరీ వెళ్లిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వాళ్లే ఈ తరహా దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
విలాసాల కోసమేనా?
ఇలాంటి కేసుల్లో పోలీసుల చూపు విద్యార్థులపై కూడా పడుతోంది. విలాసాలకు అలవాటు పడి, ఆదాయం లేక ఈ తరహా పనులకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. జల్సాలకు తల్లితండ్రులు నగదు ఇచ్చి అలవా టు చేయడం, ఒకానొకదశలో డబ్బు ఇవ్వకపోతే స్నేహితులతో కలిసి చైన్‌స్నాచింగ్, దౌర్జన్యంగా వాహనాలు, సెల్‌ఫోన్లు లాక్కునే ముఠాను రెండు రోజుల క్రితం చిత్తూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విష యం తెలిసిందే. దొరకడంతోనే వాళ్లు దొంగల య్యారు. కానీ పోలీసులకు చిక్కకుండా సమాజంలో దొరల్లా దిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. వీరిని పసిగట్టి పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది.
చోరీలతో వర్రీ
Published Thu, Dec 18 2014 4:13 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM
Advertisement
Advertisement