ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం | YS Jagan Mohan Reddy to Address at Dallas Convention Center | Sakshi
Sakshi News home page

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

Published Wed, Jul 24 2019 8:35 PM | Last Updated on Wed, Jul 24 2019 8:45 PM

YS Jagan Mohan Reddy to Address at Dallas Convention Center - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 15న బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్) లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి హాజరుకావడానికి జగన్ అంగీకరించినట్టు తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా తెలిపింది. అమెరికాలో తెలుగు వారి కోసం పనిచేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా (టీసీఎన్ఏ) తెలిపింది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement