![ఎయిర్‌కోస్టా వేసవి ఆఫర్లు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81429647349_625x300.jpg.webp?itok=ran7OwGI)
ఎయిర్‌కోస్టా వేసవి ఆఫర్లు
హైదరాబాద్: ఎయిర్‌కోస్టా ‘సమ్మర్ బొనంజా సేల్’ పేరుతో రూ. 1,099 నుంచి రూ. 3,990లకే విమాన టికెట్లను అందిస్తోంది. విజయవాడ - విశాఖ పట్నం మధ్య రూ. 1,099, విజయవాడ - చెన్నై మధ్య రూ. 1,499, హైదరాబాద్ - వైజాగ్, బెంగళూర్-హైదరాబాద్, బెంగళూరు-విజయవాడ, హైదరాబాద్- విజయవాడ పట్టణాల మధ్య రూ. 1,699లకు, చెన్నై-జైపూర్ రూ. 3,990లకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 22 ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో జూన్ 10 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణం చేయొచ్చు.