రంగాలవారీ రుణాలు ప్రకటించండి
బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఏ రంగానికి ఎన్ని రుణాలిచ్చారో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రకటించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం బ్యాంకులను ఆదేశించింది. అకౌంట్స్ విభాగానికి సమర్పించే ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లలో ఈ వివరాలు పొందుపర్చాలని పేర్కొంది. మొత్తం రుణాల్లో పదిశాతానికిపైగా ఏదైనా ఒక రంగానికి ఇస్తే సబ్‌సెక్టార్ల వారీగా రుణాల వివరాలు వెల్లడించవచ్చని ఆర్‌బీఐ ఓ నోటిఫికేషన్లో తెలిపింది. చిన్న పరిశ్రమలు, అల్పాదాయ గృహాలకు రుణాలపై ఏర్పాటైన డాక్టర్ నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు రంగాల వారీ రుణాల వెల్లడి నిబంధన పెట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.