వైజాగ్లో క్రీమ్లైన్ డెయిరీ ప్లాంటు
చెన్నై: దాదాపు రూ. 30 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు క్రీమ్‌లైన్ డెయిరీ సంస్థ సీఈవో పి. గోపాలకృష్ణన్ వెల్లడించారు. దీని సామర్థ్యం ఒక్క లక్ష లీటర్లు ఉంటుందని తెలిపారు. జెర్సీ బ్రాండ్ కింద ఎన్‌రిచ్ డీ పేరిట ఫోర్టిఫైడ్ మిల్క్ ఉత్పత్తిని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. కంపెనీ ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 10 లక్షల లీటర్ల మేర ఉంది. గతేడాది డిసెంబర్‌లో గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్‌లైన్ డెయిరీ ప్రోడక్ట్స్‌లో దాదాపు రూ. 150 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. సంస్థకు హైదరాబాద్‌లోని రెండింటితో పాటు మొత్తం ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతేడాది గ్రూప్ ఆదాయాలు రూ.1,000 కోట్ల మేర నమోదయ్యాయి.