దేశంలో తొలిసారిగా.. డైమండ్ గనుల వేలం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా డైమండ్ గనులకు వేలం నిర్వహించనున్నది. ఖనిజ వనరుల ఉత్పత్తిని పెంచడం, దిగుమతి వ్యయాలను తగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యకు శ్రీకారం చుడుతోందని గనుల శాఖ అధికారులు తెలిపారు. హత్‌పూర్ బ్లాక్ గనుల వేలానికి సంబంధించి మధ్యప్రదేశ్ టెండర్లను ఆహ్వానించనున్నదని, ఈ ప్రక్రియ 40 రోజుల్లో పూర్తికావొచ్చని గనుల శాఖ కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు.