న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో కంపెనీని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.545 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో నార్డిక్ ప్రాంతంలో మరింత శక్తివంతమవుతామని పేర్కొంది.
ఫిన్లాండ్‌లోని ఈస్‌పూ కేంద్రంగా ఫ్లూయిడో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2010లో ఆరంభమైన ఈ కంపెనీ ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, స్లోవేకియా దేశాల్లో క్లయింట్లకు సాఫ్ట్‌వేర్ సర్వీసులందిస్తోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల కోసం డైరెక్టర్ల బోర్డ్ వచ్చే నెల 15, 16 తేదీల్లో సమావేశం కానుంది. వచ్చే నెల 16న క్యూ2 ఫలితాలను వెల్లడిస్తామని ఇన్ఫీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment