ఆర్థిక సంస్కరణలపై ఆశలతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. జీఎస్‌టీ బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ చేసిన సూచనలను కేబినెట్ ఆమోదించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల్లోనే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 27,705 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 8,422 పాయింట్ల వద్ద ముగిశాయి.
వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడం, జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల చివరి రోజు కావడంతో కొన్ని షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం, డాక్టర్ రెడ్డీస్ వంటి బ్లూ చిప్ షేర్ల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, మౌలిక ప్రాజెక్టుల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం తదితర అంశాలు ప్రభావం చూపాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్తు, పీఎస్‌యూ, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,359 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.22,576 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,41,777 కోటు. ఎఫ్‌ఐఐలు రూ.171 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.500 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
రెండో రోజూ లాభాలే
Published Fri, Jul 31 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement