ముంబై: రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. లక్ష కోట్లు బదిలీ అయ్యే అవకాశాలు న్నాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న ’మిగులు మూలధన నిల్వలను’ ప్రత్యేక కమిటీ గుర్తించిన అనంతరం ఈ నిధులను బదిలీ చేసే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీవోఏఎంఎల్) ఒక నివేదికలో పేర్కొంది.
‘ఆర్‌బీఐ వద్ద ఉండతగిన మూలధన నిల్వల విధానాన్ని(ఈసీఎఫ్) రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సుమారు రూ.1–3 లక్షల కోట్ల మేర మిగులును గుర్తించే అవకాశం ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది సుమారు 0.5– 1.6 శాతానికి సమానం‘ అని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండతగిన అత్యవసర నిల్వలపై విధించే పరిమితులను బట్టి కేంద్రానికి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల కోట్ల దాకా బదిలీ కావచ్చని పేర్కొంది.
రూ.లక్ష కోట్లకు పైగా ఖజానాకు...!
Published Tue, Nov 27 2018 12:31 AM | Last Updated on Tue, Nov 27 2018 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment