జిల్లెట్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.4,133
టార్గెట్ ధర: రూ.4,515
ఎందుకంటే: ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అనుబంధ సంస్థ జిల్లెట్ ఇండియా- బ్లేడ్‌లు, రేజర్‌లు, ఓరల్ కేర్, పోర్టబుల్ విద్యుత్ ఉత్పత్తులు అందిస్తోంది.
బ్లేడులు, రేజర్‌లు, టాయిలెట్ ఉత్పత్తులను జిల్లెట్ బ్రాండ్ కింద, టూత్ బ్రష్‌లు, ఇతర ఓరల్ కేర్ ఉత్పత్తులను ఓరల్-బి బ్రాండ్ కింద, డ్యురాసెల్ బ్రాండ్ కింద బ్యాటరీలను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు రూ. 427 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 17 శాతం వృద్ధితో రూ.498 కోట్లకు పెరిగాయి. నికర లాభం రూ.110 కోట్ల నుంచి 234 శాతం వృద్ధితో రూ.367 కోట్లకు పెరిగింది. స్థూల లాభం 239 శాతం వృద్ధి సాధించింది.
గ్రూమింగ్ పోర్ట్‌ఫోలియో విభాగం 13 శాతం, ఓరల్ కేర్ వ్యాపార విభాగం 26 శాతం, పోర్టబుల్ పవర్ బిజినెస్ విభాగం 29 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నికర లాభం 16 శాతం చొప్పున వృద్ధి సాధించగలవని ఆశిస్తున్నాం. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35 గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.41గానూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.4,515 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను కొనొచ్చని సూచిస్తున్నాం.
క్యాస్ట్రాల్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 467
టార్గెట్ ధర: రూ.611
ఎందుకంటే: వాహన, పారిశ్రామిక రంగాలకు అవసరమైన ఇంజిన్ ఆయిల్స్, గ్రీజు తదితర లూబ్రికెంట్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. భారత వాహన లూబ్రికెంట్ మార్కెట్లో అగ్రశ్రేణి కంపెనీ. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు వాహన విభాగం విక్రయాలు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో కంపెనీ ఆదాయం 6% వృద్ధి మాత్రమే సాధించి రూ.859 కోట్లకు పెరిగింది. పారిశ్రామిక విభా గం విక్రయాలు మాత్రం అంచనాలను మిం చాయి. ఇబిటా మార్జిన్ 24 శాతం పెరిగింది. నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.132 కోట్లకు చేరింది.
గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక పరిస్థితి బాగా ఉండకపోవడంతో కంపెనీ అమ్మకాలు కూడా మందగమనంగానే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటంతో కంపెనీ అమ్మకాలు 5 శాతం పెరుగుతాయని అంచనా. కంపెనీ ఉత్పత్తులకు ముడి పదార్థంగా ముడి చమురు అనుబంధ పదార్ధాలను ఉపయోగిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో కంపెనీ మార్జిన్లు పెరగవచ్చు. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడుతుండడడం, వాహన అమ్మకాలు పుంజుకోనుండడం... సానుకూలాంశాలు.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్స్ వ్యూ
Published Mon, Mar 2 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement