శీతాకాల టూరిజంపై స్విట్జర్లాండ్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శీతాకాలంలో కూడా భారత పర్యాటకులను ఆకర్షించడంపై స్విట్జర్లాండ్ దృష్టి పెట్టింది. స్కీరుుంగ్, స్నో షూ ట్రెకింగ్ మొదలైన అడ్వెంచర్ స్పోర్‌ట్స్‌కు, ఇంటర్‌లాకెన్ తదితర ప్రాంతాల సందర్శనకు ఈ సీజన్ మరింత అనువైనదిగా స్విట్జర్లాండ్ టూరిజం భారత విభాగం డెరైక్టర్ క్లాడియో జెంప్ చెప్పారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇక వేసవి సీజన్‌లో టూరిస్టులను ఆకర్షించడానికి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్కై డైవింగ్, వేక్ బోర్డింగ్, కనోరుుంగ్ మొదలైన వాటి ప్రచారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు తెలియజేశారు.
భారత్ నుంచి ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య రెండంకెల స్థారుులో వృద్ధి చెందగలదని ఆశిస్తున్నట్లు సంస్థ డిప్యుటీ డెరైక్టర్ రీతు శర్మ చెప్పారు. గతేడాది భారత్ నుంచి సుమారు 8.5 లక్షల మంది స్విట్జర్లాండ్‌ను సందర్శిచారని అంచనా. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌కు అత్యధికంగా పర్యాటకులు వచ్చే దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉందని రీతూ శర్మ తెలియజేవారు. భారతీయ టూరిస్టులు స్విట్జర్లాండ్‌లో సగటున రోజుకి సుమారు 240 స్విస్ ఫ్రాంకులు వ్యయం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.