సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మనోహరమైన దృశ్యాలకు నిలయమైన స్విట్జర్లాండ్, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆ దేశ పర్యాటక శాఖ డెరైక్టర్ స్టీఫెన్ హ్యూబెర్గర్, డిప్యూటీ డెరైక్టర్ (ఇండియా) రితు శర్మ తెలిపారు. మంగళవారం వారిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాదిని ‘ది ఇయర్ ఆఫ్ ది వ్యూస్’గా ప్రకటించినట్లు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులతో ఓ విభాగం, యువతతో కూడిన మరో విభాగం ఏటా స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్నాయని వివరించారు. తొలి విభాగం పర్వత శ్రేణుల్లో విహార యాత్రలు, ప్రకృతి దృశ్యాల వీక్షణకు ప్రాధాన్యతినిస్తాయని తెలిపారు. ప్రస్తుతం యువతకు బాగా ఖర్చు పెట్టే శక్తి ఉందని, వారంతా కొత్త అనుభవాల కోసం అర్రులు చాస్తుంటారని తెలిపారు. ఇండియా నుంచి పర్యాటకుల సంఖ్య ఏటా పది శాతం చొప్పున పెరుగుతోందన్నారు. భారత పర్యాటకుల కోసం స్విట్జర్లాండ్‌లో అపార్ట్‌మెంట్లు, యూత్ స్టేలు, హోమ్ స్టేలు లాంటి వసతి సదుపాయాలున్నాయని వారు వెల్లడించారు.
పర్యాటకులకు స్విట్జర్లాండ్ టూరిజం ఆహ్వానం
Published Wed, Feb 5 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement