రూ.100కు వచ్చిన పెట్రోల్‌ను చూపుతున్న బాధితుడు
కర్నూలు, శిరివెళ్ల: పెట్రోల్ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్‌లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్ 1/2 లీటర్ కూడా లేకపోవడంతో పెట్రోల్ బంక్ బాయ్ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని బాయ్‌ను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఈ నెల 24న కూడా తాను రూ.100 పెట్రోల్ బైక్‌లో పోయించుకు ఆళ్లగడ్డకు వెళ్లి తిరిగి వస్తుండంగా మార్గ మధ్యలోనే పెట్రోల్ అయిపోయిందన్నాడు. కాగా తనకు కూడా గతంలో ఇదే పెట్రోల్ బంక్‌లో మోసం జరిగిందని మరో వినియోగదారుడు మున్నా ఆరోపించారు. ఈ విషయమై ఎస్‌ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ తూనికలు కొలతల అధికారులు తనిఖీ చేసి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment