అనుమానాస్పదంగా యువకుడు మృతి
Published Wed, Jul 20 2016 10:30 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
ఆదిలాబాద్ క్రైౖ ం : ఆదిలాబాద్ పట్టణంలోని విమనాశ్రయ మైదానంలో అనుమానాస్పందంగా యువకుడు మతి చెందాడు. బొక్కల్‌గూడ కాలనీకి చెందిన మహ్మద్ సోహేల్ పండ్ల మార్కెట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈనెల 17న ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి మార్కెట్‌కు బయల్దేరాడు. ఆరోజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా దొరకలేదు. బుధవారం శాంతినగర్ కాలనీకి ఆనుకొని ఉన్న విమనాశ్రయమైదానంలో మతదేహం లభ్యమైంది. మతుడికి మూర్చవ్యాధి ఉంది. మూర్చ వచ్చిన సమయంలో ఎవరూ సమీపంలో లేకపోవడంతో అక్కడికక్కడే మతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement