బయటే విధులు నిర్వహిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
జూపాడుబంగ్లా : పాము భయంతో వ్యవసాయ అధికారులు ఆరుబయటే విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. జూపాడుబంగ్లా వ్యవసాయ కార్యాలయానికి సొంత భవనం లేకపోవటంతో ఫారం భవనాల్లో తాత్కాలికంగా వ్యవసాయ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ కార్యాలయం చుట్టూ పిచ్చిమొక్కలు ఉండటంతో పాటు భవనం వెనుక భాగంలో చెత్తాచెదారం పేరుకపోయి ఉండటంతో వ్యవసాయ కార్యాలయంలోకి పాము చొరబడింది. పామును చూసిన సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో వారు కార్యాలయానికి తాళం వేసి బయటే విధులు నిర్వహిస్తున్నారు.