నేటి నుంచే దేహదారుఢ్య పరీక్షలు
♦ పోలీస్ రిక్రూట్‌మెంట్.. మొదట 800 మీటర్ల పరుగు
♦ ఇందులో అర్హత సాధించిన వారికే.. ఈవెంట్స్
♦ రోజూ 1200 మందికి పరీక్షలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడి
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థులకు మొదట 800 మీటర్ల పరుగును నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో అర్హత సాధించిన వారికే మరుసటి రోజు ధృవ పత్రాల పరిశీలన, ఎత్తు, ఛాతి కొలత, బరువు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్ తదితర ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిరోజూ 1200 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
పోలీస్ క్వార్టర్స్‌లో హరితహారం
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో గల పోలీసు క్వార్టర్స్ ప్రాంగణంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటి నీళ్ళు పోశారు. అక్కడ ఉన్న బాలలకు చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) టి.వెంకన్న, ఏఆర్ అదనపు ఎస్పీ బాపురావు, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, ఏఆర్‌డీఎస్పీ కిషన్‌రావు, సంగారెడ్డి పట్టణ సీఐ రామకృష్ణరెడ్డి, సంగారెడ్డి రూరల్ సీఐ నరేందర్, కొండాపూర్ సీఐ ఆంజనేయులు, ఆర్‌ఐ రాంబాబు, ఎస్‌ఐలు రమేష్, గణేష్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.