కడప అర్బన్: జిల్లా పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్న కొందరు అవినీతి పోలీసు అధికారులు, సిబ్బంది చిట్టాను జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు దష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, పలువురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ డీఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఐలు, ఎస్‌ఐలు, పలువురు పోలీసు కానిస్టేబుళ్లకు మట్కా నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న ఎస్పీ తన విశ్వసనీయ సిబ్బంది చేత నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. నివేదికతోపాటు సదరు సిబ్బంది జాబితాను కూడా ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరో రెండు రోజుల్లో డీజీపీ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆ జాబితాలో పేరున్నట్లు భావిస్తున్న పోలీసు అధికారుల్లో దడ మొదలైంది.
అవినీతి చిట్టా.. డీజీపీ చెంత
Published Wed, Oct 19 2016 11:42 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement