క్షేత్రయ్య పదాలతో భరతనాట్య ప్రదర్శన | cultural activities | Sakshi
Sakshi News home page

క్షేత్రయ్య పదాలతో భరతనాట్య ప్రదర్శన

Published Tue, Aug 23 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

క్షేత్రయ్య పదాలతో భరతనాట్య ప్రదర్శన

క్షేత్రయ్య పదాలతో భరతనాట్య ప్రదర్శన

దంపతుల శిష్య బృంద కోలాట నృత్యం
మొవ్వ(కూచిపూడి):
కృష్ణా పుష్కరాల సందర్భంగా మొవ్వ గ్రామంలోని మువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్షేత్రయ్య పద నృత్యాలు కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన మంగళవారం చంద్రగిరికి చెందిన సాంప్రదాయ స్కూల్‌ ఫర్‌ భరతనాట్యం నిర్వాహకురాలు చింతం పుష్పం శిష్యబృందం, విజయవాడకు చెందిన భారతీయ భారతి స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ నిర్వాహకులు హేమంత్‌కుమార్, పద్మశ్రీ దంపతుల శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య శైలిలో ప్రదర్శించిన అంశాలు ప్రేక్షకులను సమ్మోహనపరిచాయి. ఆర్‌.వరలక్ష్మి, ఈ.నాగసాయి మేఘన, పి.అనూష, ఎం.బాలనాగఇంద్రాని, యు.దివ్యశ్రీలు, జస్విన్, నిర్మల, లేక్య, హిమజ, గాయత్రి, సిరి కుసుమ, మాళిక, ప్రియాంక, లహరి, సాహితి, శ్రీకరి, సుస్మితాలు  క్షేత్రయ్య పదాలు, అన్నమాచార్య కీర్తనలను భరతనాట్య శైలిలో ప్రదర్శించి ప్రేక్షకులను రజింప చేశారు. కార్యక్రమాలను సాంస్కృతిక ప్రదర్శనల కోఆర్డినేటర్‌ వేదాంతం వెంకటనాగచలపతి పర్యవేక్షించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement