► ప్రతీ పౌరుడు ఓటరుగానమోదు చేసుకోవాలి
► ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం
► నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్
► కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్‌సిటీ: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎలక్ట్రోరల్ స్పెషల్ రివిజన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో జరిగే ఎలక్ట్రోరల్ స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను నిర్వహించలేకపోయామని, ఆ ప్రక్రియను ఏప్రిల్, మే, జూన్‌లో నిర్వహించా మని పేర్కొన్నారు.
మొత్తం ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4 శాతం మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన వారుండాలని పేర్కొన్నారు. సర్వే ప్రకారం ఓటర్ల జాబితాలో 21,000 మంది 18–19 ఏళ్లు వారుండాల్సినప్పటికీ 3,924 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. అందుకే జూలై 31 వరకు స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటర్ల నమోదుకు అధికారులు, కళాశాల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ప్రతీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో యాజమాన్యాలు సహకరించి ఓటర్ల నమోదు పత్రాలను నింపేలా సహకరించాలన్నారు. ఆటోలకు, బస్సులకు పోస్టర్లు అంటించి బస్సులలో స్లోగన్లను రాయిస్తామన్నారు. అందరికీ అవగాహన కలిగేలా రద్దీ ప్రదేశాలలో, దుకాణాలలో పోస్టర్లను అంటిస్తామని తెలిపారు. గ్రామాలలో రేషన్ షాపులలో స్లోగన్‌లను పెట్టి ఓటర్ల జాబితాలో నమోదుకు ప్రచారం కొనసాగిస్తామన్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేసుకునే సదుపాయం ఉందని పేర్కొన్నారు. యువతీ యువకులు నమోదు చేసుకునేలా 19 మంది అధికారులను వివిధ కార్యకలాపాల నిమిత్తం నియమించామని తెలిపారు. డీఆర్వో అయేషా మస్రత్‌ఖానమ్, ఆర్డీవో రాజాగౌడ్ తదితరులున్నారు.
యువతా.. మేలుకో..
Published Thu, Jul 6 2017 11:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement