రాచాయపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫుడ్‌ఫెస్టివల్‌ | food festival in rachayapeta school | Sakshi
Sakshi News home page

రాచాయపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫుడ్‌ఫెస్టివల్‌

Published Sat, Nov 12 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

food festival in rachayapeta school

గోపవరం : మండలంలోని రాచాయపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫుడ్‌ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని శుక్రవారం విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించిన ఫుడ్‌ఫెస్టివల్‌కు పాఠశాలలోని 200 మంది విద్యార్థులు వివిధ రకాల వంటలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వంటకాల ప్రదర్శనలో విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసేందుకు గోపవరం, బ్రాహ్మణపల్లె ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, సత్యనారాయణశర్మలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విజేతలుగా ఎంపికైన విద్యార్థులను 14వ తేదీ బాలల దినోత్సవం రోజున బహుమతులను అందచేయనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జిలానిబాష, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement