పండితులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
స్వరూపానందేంద్ర సరస్వతి విమర్శ
సాక్షి, విశాఖపట్నం: పండితులను, దేవాలయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పెందుర్తి శారద పీఠంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 రాష్ట్రానికి అంతగా బాగోలేదని.. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగడం కోసం ఈనెల 14 నుంచి 18 వరకు శారదా పీఠంలో సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామిలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నామని స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 18వ తేదీ కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పండితులను రప్పించి వారిని స్వర్ణ కంకణధారణతో సత్కరిస్తామని వివరించారు.