విద్యార్థుల జీవితాలతో చెలగాటం
-
డిప్యూటీ సీఎం శ్రీహరి, మంత్రి లకా్ష్మరెడ్డి రాజీనామా చేయాలి
-
డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి
వరంగల్ : ఎంసెట్–2 పేపర్ లీకేజీ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని డీసీసీ కార్యాలయ కూడలీలో ఎంసెట్–2 లీకేజీకి నిరసనగా శుక్రవారం యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్–2 వ్యవహారం పై రాష్ట్ర మంత్రులు, ఉన్నత విద్యామండలి యంత్రాంగం పేపర్ లీక్ కాలేదని బుకాయించే ప్రయత్నాలు చేశారన్నారు. ఆధారాలతో పత్రికలు కథనాలు ప్రచురించడంతో ముందు పేపర్ లీక్ కాలేదని ప్రకటించిన యంత్రాంగం ఇప్పు డు గందరగోళంలో పడిందన్నారు. దర్యాప్తు జరుగుతోందని, నివేదికలు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఊదాసీనత ప్రకటనలు చేయ డం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పుడు ఎంసెట్–2 రద్దు చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నందున చదివిన చదువంతా వృథా అవుతుందన్న బాధ విద్యార్థుల్లో వ్యక్తమవుతోందన్నారు. ఎంసెట్–2 లీక్‌కు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి లకా్ష్మరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు రాస్తారోకో నిర్వహించారు
. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని హన్మకొండ పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, యువజన కాంగ్రెస్ నాయకుడు లింగాజీ, పరకాల ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జెడ్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ లేతాకుల సంజీవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీను, మంద వినోద్‌కుమార్, గోల్కొండ సదానందం, నాగరాజు, మండల సమ్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మానుపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.