ముంపు బాధితులకు అండగా ఉంటాం
-
మానవ హక్కుల వేదిక జిల్లా
-
అధ్యక్షుడు బాదావత్ రాజు
ఏటూరునాగారం : గోదావరి ముంపు బాధితులకు అండగా ఉంటామని మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు బాదావత్ రాజు అన్నారు. మండలంలోని రొయ్యూర్ బీట్ పరిధి కోడిపుంజుల అంగడి ప్రాంతాన్ని మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో మా ట్లాడి భూమి విషయమై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నోఎళ్ల నుంచి గోదావరి ముం పుకు గురవుతుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందిం చడం లేదన్నారు.
ప్రతి వర్షాకాలం వచ్చిం దంటే తట్ట, బుట్ట తలపై పెట్టుకొని పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు ఉండే మానసపల్లి తరుచూ ముంపుకు గురవుతుందన్నారు. వర్షాలు, వరదలు వచ్చి ముంపు గురవుతున్నా .. ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. నిరుపేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .రొయ్యూర్ బీట్ పరిధిలోని 34 ఎకరాల భూమిని పేదలకు కేటాయించి స్థిరనివాసాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలన్నారు. కార్యక్రమంలో మానవ హక్కులవేదిక ప్రధాన కార్యదర్శి అద్దెనూరి యాదగిరి, ఉపాధ్యక్షులు హరికృష్ణ, వీవీ నారాయణ, సభ్యులు ప్రసాద్, లవకుమార్, శ్రీనివాస్, దిలీప్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.