కదిలి వచ్చిన గోదారమ్మ
కదిలి వచ్చిన గోదారమ్మ
Published Thu, Jun 1 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM
నిడదవోలు : పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి జలాల పరవళ్లు ప్రారంభమయ్యాయి. విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమడెల్టా ప్రధాన కాలువకు ఇరిగేష న్ అధికారులు సోమవారం గోదావరి జలాలను విడుదల చేశారు. వేద పండితులు నిర్ణయించిన ఉదయం 7.10 గంటలకు జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మ న్ పాతూరి రామాంజనేయరాజు, గోదావరి డెల్టాల సీఈ బి.రాంబాబు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్ స్విచ్ఛా న్ చేసి హెడ్ స్లూయిజ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. హెడ్ స్లూయిజ్ మొదటి గేటును ముందుగా ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం దశలవారీగా మిగిలిన మూడు గేట్లను ఎత్తి 100 నుంచి 500 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. ముందుగా హెడ్‌సూ్లయిజ్ పైన గేట్లను ఎత్తివేసే స్వీచ్ బోర్డు వద్ద అధికారులు వేదపండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ డెల్టా ప్రాంతాల్లో తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏటా డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుతూ వేద పండితులు వేదాల నడుమ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి మాతకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్‌ను మామిడి తోరణాలు, అరటి చెట్లు, అరటి గెలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద వాతావరణం నూతన శోభను సంతరించుకుంది. «ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ బి.రాంబాబు, నీటిపారుదల శాఖ శెట్టిపేట ఏఈ జి.శ్రీనివాసరావు, హెడ్ వర్క్స్ ఈఈ ఎ న్.కృష్ణారావు, నరసాపురం ఈఈ సీహెచ్ వెంకట నారాయణ, తాడేపల్లిగూడెం ఈఈ జె.బాబూనాయక్, ఏఈఎస్ డి.రాధాకృష్ణ, ఆర్‌సీవో పి.విజయసుందర్, ఏఈలు సూర్యనారాయణమూర్తి, డి.రాధాకృష్ణ, పి.విజయకుమార్, ఎస్.కొండలరావు పాల్గొన్నారు.
Advertisement