- బుధవారం ఇష్టంలేని పెళ్లి చేసిన పెద్దలు
- గురువారం ప్రియుడితో పరార్
- శుక్రవారం ఇద్దరూ కలిసి ఆత్మహత్య
వికారాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అక్క మరిదిని ప్రేమించింది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ నెల 17న ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్లైన తెల్లారే ప్రియుడితో కలసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ మరుసటిరోజే ప్రేమికులిద్దరూ కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామానికి చెందిన లావణ్య(18)కు కొంపల్లికి చెందిన రాంనివాస్(23) తో పరిచయం ఉంది. అక్క మరిది కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో లావణ్యకు ఇంట్లో వాళ్లు ఫిబ్రవరి 17న ఇష్టంలేని పెళ్లి చేశారు. తరువాత రోజు గురువారం ఆమె తన ప్రియుడితో కలసి ఇంటినుంచి వెళ్లిపోయింది.
కాగా శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్-చిట్టిగడ్డ మధ్య ప్రాంతంలో రైలు కింద పడి ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లైన రెండు రోజులకే..
Published Fri, Feb 19 2016 8:18 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement