మావుళ్లమ్మ చీరకు బంగారం సమర్పయామి | mavullamma chiraku bangaram | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ చీరకు బంగారం సమర్పయామి

Published Thu, Aug 18 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

mavullamma chiraku bangaram

భీమవరం : భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి బంగారు చీర తయారీకి గాను హైదరాబాద్‌ నగరానికి చెందిన కె.పావని 10 గ్రాములు, గుడిమెట్ల సూర్యప్రకాష్‌రెడ్డి 4 గ్రాముల బంగారాన్ని బుధవారం ఆలయంలో అందజేశారు. అలాగే అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలకు బహిరంగ వేలంపాట నిర్వహించగా రూ.49,190 ఆదాయం వచ్చినట్టు వేలంపాట పర్యవేక్షణ అధికారి సీహెచ్‌ సురేష్‌నాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు అడ్డగర్ల ప్రభాకర గాంధీ, అడ్డాల సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వరరావు, శిరిగినీడి చంద్రశేఖర్, లంకె శ్రీనివాసరావు, బాపిరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement