'మొదట నన్ను అరెస్ట్ చేయండి'
విశాఖపట్నం : కాపు ఉద్యమానికి పూర్తి తనదేనని... ఆ సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. శనివారం విశాఖపట్నం జిల్లా కసింకోటలో మరణించిన స్థానిక కాపు సంఘం నేత సోదరుడి మృతదేహాన్ని ముద్రగడ సందర్శించారు.
అనంతరం ముద్రగడ మాట్లాడుతూ... అరెస్ట్‌ల క్రమంలో కాపు జాతిని హింసించవద్దని ప్రభుత్వానికి సూచించారు. అరెస్ట్ చేయాలనుకుంటే మొదట తనను అరెస్ట్ చేయాలని ప్రభత్వానికి ముద్రగడ విజ్ఞప్తి చేశారు.