లాభాల ‘పాలు’ | profit with murra cows | Sakshi
Sakshi News home page

లాభాల ‘పాలు’

Published Sun, Jul 24 2016 7:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

profit with murra cows

  • పాల దిగుబడికి సాటి.. ముర్రాజాతి గేదెలు (గౌడి గేదెలు)
  • అధిక పాలతో ముర్రాజాతి
  • ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం..
  • లక్సెట్టిపేట : పాల ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉంది. భారతదేశంలో  జనాభా సుమరు 125 కోట్లు ఉంటే  ప్రస్తుత పాల సగటు తలసరి వినియోగం 235 గ్రాములు మాత్రమే ఉన్నది. న్యూట్రిషనిష్టుల సూచనల ప్రకారం సగటు తలసరి వినియోగం రోజుకు 250 గ్రాముల పైనే అవసరముందని అంటున్నారు. దేశంలో ఉన్న పాల దిగుబడి 110 మిలియన్‌ టన్నులు, 5శాతం వద్ధి రేటుతో 2020 వ సంవత్సరానికి 150 మిలియన్‌ టన్నుల పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉన్నది.
    కాబట్టి  అధిక పాల దిగుబడికి ఎక్కువ పాలసార కలిగిన శ్రేష్టమైన జాతి పశువులు ప్రస్తుతం అవసరం. మనకున్న పశువుల్లో ఎక్కువ శాతం తక్కువ పాలసార ఉన్న నాటు జాతి పశువులు, కావున వీటిలో అధిక దిగుబడి అశించడం అసాధ్యం. దేశవాళి పశువుల స్థానంలో శ్రేష్టమైన జాతుల్ని పెంపొందించుకుని పోషించాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి రైతులు ముర్రాజాతి గేదెలను పెంచుకుంటె అధిక పాల దిగుబడితో పాటు ఆర్థికంగా కూడ అభివద్ధి చెందవచ్చు.
    –ముర్రాజాతి గేదెలను పొందే విధానం
    గ్రామీణ ప్రాÆ తాల్లో ఈ జాతి గేదెలను గౌడి గేదెలు అని కూడా పిలుస్తారు. 
    1. కత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా మనదేశవాళి గేదెల నుంచి గ్రేడీడ్‌ ముర్రాజాతి దూడలను పొందవచ్చు.    
    2. పిండమార్పిడి ప్రక్రియ ద్వారా పొందవచ్చును.
    3. ప్రభుత్వ పథకాలు పశుక్రాంతి పథకం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి పొందవచ్చు.
    ప్రస్తుతం మన రైతులకు పై మూడింటిలో కత్రిమ గర్ఛోత్పత్తి మరియు పశుక్రాంతి పథకం ద్వారా సులభంగా పొందవచ్చు. 
    ముర్రాజాతి గేదెల వల్ల లాభాలు
    ముర్రా అంటే మెలివేయబడిన అని అర్దం. వీటి కొమ్ములు మెలివేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్‌ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు.  దేశంలోని జీవజాతుల్లో అత్యంత శ్రేష్టమైన ది, పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది ముర్రా జాతి. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం. దేశవాళఙ గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్‌గ్రేడ్‌ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు.
    దేశవాలి గేదెలకంటే ఎక్కువ పాలనిస్తాయి. సుమారు రోజుకు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలను ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ (వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల మరియు ఎక్కువ కాలం పాడితో ఉండడం వల్ల). వీటికి ఋతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతో దఢమైన దూడలనిస్తాయి.  దూడబరువు రోజువారీగా 400–500 గ్రాములు పెరుగుతూ తొందరగా ఎదకు వస్తాయి. 
    వీటిని పొందే విధానం....
    ముర్రాజాతి గేదెకు ఒక దానికి సుమారు 50,000 వేలు ఉంటుంది. 
    రవాణా ఖర్చులు సుమారుగా 6500 రూపాయలు అవుతుంది.
    ఇన్సూరెన్సు గేదెకు సంవత్సరానికి 2000వేలు చెల్లించాలి. 
    గేదె ధరను బట్టి 4 నుంచి 5 శాతం వరకు ఇన్సురెన్సును లెక్కిస్తారు. 
    ఇన్సూరెన్సు చెల్లించడం వల్ల గేదె ప్రమాదవశాత్తు చనిపోతే యజమాని నష్టపోకుండా ఉండవచ్చు. 
    ఈ క్రింది బీమా కంపెనీలు ఇన్సూరెన్సులను ఇస్తున్నాయి.
    నేషనల్‌ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్‌
    యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్సు కంపెనీ
    న్యూ ఇండియా ఇన్సురెన్సు కంపెనీ
    బ్యాంకు రుణాలు..
    యజమాని ఒక గేదెను కొనడానికి సుమారు అరవై వేల వరకు పెట్టుబడి పెట్టాలి, కానీ అంతపెట్టుబడి పెట్టలేని వారికోసం ప్రభుత్వం సాధారణ మధ్య తరగతి రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి ముర్రాజాతి గేదెలను దిగుమతి చేసుకునే అవకాశాన్ని బ్యాంకు రుణాల ద్వారా కల్గిస్తోంది. గేదె ధరకు మార్జిన్‌ మనీ క్రింద ఇరవై  శాతాన్ని చెల్లించాలి. దీనికి మిగతా రూపాయలు బ్యాంకు వారు చెల్లించి గేదెను దిగుమతి చేస్తారు. ఇందులో  సుమారు 25 నుంచి 50 శాతం వరకు సబ్సీడీ కూడా వర్తిస్తుంది. మధ్య తరగతి కుటుంబాలు ఒకేసారి 5 నుంచి 10 గేదెల ద్వారా మినీ డెయిరీని పెట్టుకునే వారు బ్యాంకు వారిని సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. గేదె చనిపోతె ఇన్సూరెన్సు వారు మెత్తంగా చెల్లిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విభజన దష్ట్యా ఇంకా ఎటువంటి సబ్సీడీ, రుణాల సమాచారం రాలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement