లారీ కింద పడి బాలుడి మృతి
Published Fri, Nov 11 2016 2:32 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
ఏలూరు అర్బ¯ŒS : బంధువుల ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ లారీ కింద పడి మరణించాడు. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన రాపోలు జెమిని గణేష్ (17) బుధవారం రాత్రి ఏలూరు మండలం చొదిమళ్ల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు నూజివీడు నుంచి లారీలో వచ్చాడు. చొదిమెళ్ల సెంటర్‌లో లారీ ఆపి కిందికి దిగాడు. ఈలోగా వెనుకగా వచ్చిన మరో లారీ మితిమీరిన వేగంతో ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఆ లారీ సమీపంలో నిలబడి ఉన్న గణేష్‌పై దూసుకొచ్చింది. దీంతో లారీ చక్రాల కిందపడి బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ ఎం.వి.సుభాష్‌బాబు ఘటనా స్థలానికి వెళ్ళి విచారించినా బాలుడి వివరాలు వెల్లడి కాకపోవడంతో తొలుత గుర్తు తెలియని బాలునిగా భావించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం బాలుని బంధువులు వివరాలతో స్టేష¯ŒSకు రావడంతో పోస్ట్‌మార్టం అనంతరం వారికి బాలుని మృతదేహాన్ని అప్పగించారు.
Advertisement
Advertisement