ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి దుర్మరణం
Published Wed, Feb 1 2017 1:14 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కర్నూలు : నంద్యాల పట్టణంలోని కోట వీధిలో నివాసముంటున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి జనార్దన్‌రావు(60) రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఆళ్లగడ్డ డిపోలో క్లర్కుగా పనిచేస్తూ ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందాడు. అప్పటినుంచి కుటుంబ సభ్యులతో కలసి నంద్యాల కోట వీధిలో నివాసముంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా తరచూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవాడు. ఈయనకు ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు సంతానం. బయటకు వెళ్లకుండా ఆయనను భార్య గోవిందమ్మ ఇంట్లోనే కాపలాగా ఉంటూ చూసుకునేవారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో బయటకు వచ్చి అర్ధరాత్రి కర్నూలుకు చేరుకున్నాడు. ధర్మపేట హంద్రీ బ్రిడ్జిపై రైల్వే ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. మంగళవారం ఉదయం స్థానికులు కనుగొని సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్‌ఐ జగన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement