చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్ | somu veerraju slams ap government once again | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్

Published Wed, Oct 28 2015 12:33 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్ - Sakshi

చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను ఎవరైనా తగలబెడితే వెంటనే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం.. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తే మాత్రం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల పరిస్థితిని బాలకృష్ణ పరిశీలించాలని వీర్రాజు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ నీతి ఆయోగ్‌కు సిఫార్సు చేసిన విషయం బాలకృష్ణకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం నిరంతర విద్యుత్ ఇవ్వడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులిస్తున్నా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని చెప్పారు. కేంద్ర నిధులను బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీలు తింటున్నారని విమర్శించారు. ప్రజలందర్నీ ఏపీ సర్కార్ గందరగోళంలో పడేస్తోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement