టీచర్ కాల్చింది.. కాదు దేవత పూనింది.. | student severely punished by teacher in adilabad district | Sakshi
Sakshi News home page

టీచర్ కాల్చింది.. కాదు దేవత పూనింది..

Published Sun, Dec 6 2015 10:54 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student severely punished by teacher in adilabad district

నార్నూర్: చెప్పినమాట వినలేదని 11 ఏళ్ల విద్యార్థినిని పైశాచికంగా దండించిందో ఉపాధ్యాయురాలు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఒకలా, ఉపాధ్యాయులు మరోలా వాదిస్తున్నారు.

హస్నాపూర్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల సావిత్రి.. జైనూరు మండలం రాసిమెట్టలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆమెకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయినుల్లో ఒకరు.. సావిత్రి చేతిలో కణకణమండే నిప్పు కణికలు పోసింది. దీంతో ఆ చిన్నారి అరచేయి తీవ్రంగా కాలిపోయింది. మాటవినడంలేదంటూ టీచరే నిప్పులు పోసిందని బాధితురాలు, తోటి విద్యార్థినులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

అయితే దీనిపై ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతి మరోలా వివరణ ఇచ్చారు. టీచర్లెవరూ విద్యార్థినిని దండించలేదని, సావిత్రికి దేవత పూని ఊగిపోతున్నప్పుడు తోటి విద్యార్థినులే అగ్గిరవ్వలతో చురుకుపెట్టారని చెప్పుకొచ్చారు. గాయం సంగతి తెలిసిన వెంటనే విద్యార్థినికి ఆసుపత్రిలో వైద్యైం చేయించామన్నారు. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement