![టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71451027912_625x300.jpg.webp?itok=K7nYXjXZ)
టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు శుక్రవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది. కంచిలి మండలం బూర్గామ్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించపోయిన క్రమంలో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ సమయంలో శిరీష సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.