ముగ్గురిపై సస్పెన్షన్ వేటు?
♦ మందుల కొనుగోలు వ్యవహారం
♦ వైద్య ఆరోగ్య శాఖలో అక్రమార్కులు
♦ కలెక్టర్, డీఎంహెచ్‌వోను
♦ తప్పుదోవ పట్టించిన వైనం
నిజామాబాద్ అర్బన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మందుల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు సిబ్బంది పై సస్పెన్షన్ వేటు పడనుంది. ఓ మాజీ అధికారి, నలుగు సిబ్బంది కలిసి అక్రమాలకు తెరలేపారు. ఏడాదిగా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. 2015లో వైద్య ఆరోగ్యశాఖలోరూ. 52 లక్షలతో మందుల కొనుగోలుకు అప్ప టి జిల్లా వైద్యాధికారి నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి రూ. 7 లక్షల మందులకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. వీటికి టెం డర్లు నిర్వహించారు. అనంతరం పాత అనుమతులతోనే రూ. 45 లక్షల మందులను కొనుగో లు చేశారు. ఇందుకు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగిం చారు. వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఏజెన్సీ నిర్వాహకులు మందులు సరఫరాకు చేసేందుకు ముందుకు రాగా, వారికి పోటీగా ప్రకాశం జిల్లాకు చెందిన ఏజెన్సీ నిర్వాహకుడు మందులు తక్కువ ధరకు సరఫరా చేస్తానని పేర్కొన్నాడు.ఒక మందు బిల్లను రూ. 2 లకు సరఫరా చేస్తానని దరఖాస్తు చేశాడు. అయితే నాటి వైద్యాధికారి వరంగల్, మహబూబ్‌నగర్,నిజామాబాద్ జిల్లాలకు చెం దిన ఏజెన్సీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని ఒక్క మందు బిల్లను రూ.7 లకు కొనుగోలు చేశారు.
ఇందులో వైద్యాధికారికి రూ. 8 లక్షలు, సిబ్బందికి , మరో అధికారికి రూ. 4 లక్ష లు మామూళ్లు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఏజెన్సీ నిర్వాహకుడు అప్పటి కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణాధికారిగా డీఆర్‌వోను నియమించారు. డీఆర్‌వో చేపట్టిన విచారణలో మందుల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. టెండర్లు లేకుండా ఎక్కువ ధరకు మందులు కొనుగోలు చేయడం బట్టబయలైంది. డీఆర్‌వో నివేదిక మేరకు మందుల ఏజెన్సీలకు బిల్లులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. ఏడాది కాలంగా రూ. 52 లక్షల బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఫైలు కలెక్టరేట్‌లో ఉండడంతో సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. వైద్యశాఖ సిబ్బంది సూచనల మేరకే ఏజెన్సీ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు వేయడం ద్వారా ఫైలు ముందుకు కదులుతుందని,బిల్లులు పొందవచ్చునని పథకం పన్నారు.
ఇందులో రిటైర్డ్ అయిన అధికారి మం దుల కొనుగోలుకు సంబంధించి డిసెంబర్‌లోనే ఆడిట్ చేయించారు. మార్చిలో చేయవల్సిన ఆడిట్ నాలుగు నెలల ముందుగానే ముగిం చారు. అనంతరం ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. కోర్టు నుంచి వైద్య శాఖకు నోటీసులు జారీ కావడంతో మందుల కొనుగోలుకు సంబంధించి ఫైలు కలెక్టర్ వద్ద ఉందని, తమకు సంబంధం లేదంటూ ప్రస్తుత జిల్లా వైద్యాధికారిణి సమాధానం ఇచ్చారు. అనంత రం కోర్టు నుంచి బిల్లులు చెల్లించకపోవడంపై డీఎంహెచ్‌వో, కలెక్టర్‌ను హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టుకు సమాధా నం చెప్పిన తరువాత కలెక్టర్ తీవ్ర స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖపై మండిపడ్డారు. మందుల కొనుగోలులోతప్పుడు రిపోర్టులు, సమాచారం అందించకపోవడం,నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల నిర్వహణపై ముగ్గురు వైద్య సిబ్బం దిపై సస్పెన్షన్‌వేటు వేసే అవకాశం ఉందని తెలిసింది. టీబీ కార్యాలయం నుంచిడిప్యుటేషన్‌పై కొనసాగుతున్న అధికారి ఒకరు, మరో ఇద్దరు ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించినట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు. మరో రెండు రోజుల్లో చర్యలు అమలు కానున్నాయి.