నేటి నుంచి ‘రత్నగిరి’ బ్రహ్మోత్సవాలు | today rathnagiri brahmothsavas start | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘రత్నగిరి’ బ్రహ్మోత్సవాలు

Published Sat, Apr 8 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

నేటి నుంచి ‘రత్నగిరి’ బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి ‘రత్నగిరి’ బ్రహ్మోత్సవాలు

రొళ్ల (మడకశిర) : రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్లాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారి కె.శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

9న జలధి ఉత్సవం, కలశ స్థాపన, 10న బ్రహ్మ రథోత్సవం, 11న కలశ ఉత్సవం, గంగ పూజ, 12 నుంచి 15 వరకు భక్తులచే హారతి ఉత్సవాలు, 16న రాత్రి ఆర్డీటీ  ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, 17న పోతులరాజు బండార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉత్సవం సందర్భంగా రోజూ ఓ కార్యక్రమం చొప్పున నాటిక, హరికథలు ఉంటాయన్నారు. భక్తులకు మడకశిర ఆర్టీసీ డిపో నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం మధుగిరి, శిరా, పావగడ నుంచి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement