పాలేరు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రచారవ్యూహం | TRS party appoints incharge for evey mandal in paleru by elections | Sakshi
Sakshi News home page

పాలేరు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రచారవ్యూహం

Published Sat, Apr 30 2016 9:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

పాలేరు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రచారవ్యూహం

పాలేరు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రచారవ్యూహం

- మే 16న పాలేరులో ఉప ఎన్నిక
- ప్రతి మండలానికి ఒక ఇంచార్జ్ నియామకం
-  మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో మొత్తం పాలేరు ఉప ఎన్నిక


ఖమ్మం: మే 16న పాలేరులో జరుగనున్న ఉప ఎన్నికపై దృష్టిసారించిన అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచార వ్యూహంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాలేరు నియోజవర్గ పరిధిలో ఉన్న ప్రతి మండలానికొక ఇంచార్జ్ను నియమించింది. వారిలో నేలకొండపల్లి మండలానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నియమించింది.

అదేవిధంగా కూసుమంచి మండలానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తిరుమలాయపాలెంకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఖమ్మం రూరల్ మండలానికి మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నియమించింది. ఈ నేపథ్యంలో మొత్తం పాలేరు ఉప ఎన్నికను తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement