వాకీటాకీలను అందిస్తున్న మేయర్ లక్ష్మీనారాయణ
బల్దియా అధికారులకు వాకీటాకీలు
Published Sat, Aug 6 2016 7:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
కోల్‌సిటీ : కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ వైర్‌లెస్ సెట్టు (వాకీటాకీ) శనివారం పంపిణీ చేశారు. వాకీటాకీలు బృంద సమాచార వ్యాప్తికి ఉపయోగపడుతాయని మేయర్ అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన 12వ ఆర్థిక సంఘం నిధులతో ఈ వాకీటాకీలను కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం 40 వాకీటాకీలు, మూడు సంచార వాకీటాకీలను ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. శానిటేషన్, వాటర్ సప్లై, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో కీలక విధులు నిర్వహిస్తున్న వారికి అందజేయనున్నట్లు మేయర్ వెల్లడించారు. వాకీటాకీలతో పనుల్లో జాప్యం జరుగకుండా ఉంటుందన్నారు. తొలివిడతలో పారిశుధ్య సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ జాన్‌శ్యాంసన్, మున్సిపల్ ఈఈ జగన్మోహన్‌రావు, డీఈఈ మాధవి, మహేందర్, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శంకర్‌రావు, శానిటరీ సూపర్‌వైజర్లు కిశోర్‌కుమార్, పవన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Advertisement