సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు
తిరుపతి తుడా: శ్రీనివాస సేతు పిల్లర్లపై నిబంధనల కు విరుద్ధంగా అతికించిన వాల్ పోస్టర్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపించారు. వాల్ పోస్టర్లు అతికించిన సంస్థకు భారీ జరిమానా విధించారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
లీలామహల్ సర్కి ల్ నుంచి మంగళం వైపు ఉన్న శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ స్తంభాలపై అనులతులు లేకుండా చేన్నైస్ అమ్రిత ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్ మెంట్ సంస్థ వాల్ పోస్టర్‌లను అతికించింది. ఫిర్యాదులు అందడంతో ఆయన సిబ్బందితో కలిసి సదరు హోటల్‌ను సీజ్ చేశారు. పిల్లర్లపై అతికించిన వాల్ పోస్టర్‌లను తొలగించారు. సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment