ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు
తిరుపతి క్రైం: తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు నాన్‌న్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. మంగళవారం జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచందర్ రావు నేతృత్వంలో పది బృందాలుగా ఏర్పడి తిరుపతి మొత్తం జల్లెడ పట్టారు. ఆహారం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటళ్లపై వరుసగా దాడులు చేశారు. నగరంలోని పలు హోటల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చికెన్, మటన్, ఫిష్‌తో పాటు పన్నీర్ చెడిపోకుండా కెమికల్స్ కలుపుతున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ల నిర్వాహకులు.. ఫార్మలిన్ కలిపిన చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. 16 హోటళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో శ్యాంపిల్స్‌ను సేకరించారు. అదేవిధంగా 10 హోటళ్లలో అపరి శుభ్రంగా ఉన్నందుకు గాను నోటీసులు జారీచేశారు. వంటకాల్లో సింథటిక్ కలర్లు కలిపిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నట్లు నిర్ధారించారు.
ఉపేక్షించేది లేదు
ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని తిరుపతిలో ఉన్న ప్రతి హోటల్, రెస్టారెంట్లలో కూడా దాడులు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరికీ ఆదేశాలు జారీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment