భక్తులకు మెరుగైన సేవలు
తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు బాధ్యతాయుతంగా మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈవో గౌతమి సూచించారు. డిప్యుటేషన్‌పై రానున్న సిబ్బందికి శ్వేతా భవనంలో జరిగిన శిక్షణలో ఆమె తిరుపతి జిల్లా ఎస్పీతో కలసి పాల్గొని పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ క్యూలలోని భక్తులకు సంయమనంతో టోకెన్లు జారీ చేయాలని, భక్తుల పట్ల క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. టోకెన్లు జారీకి కావాల్సిన మౌళిక సదుపాయాలైన కంప్యూటర్లు, ప్రింటర్లు, కెమెరాలు, ఆధార్ కార్డు గుర్తించేలా తదితర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. భక్తుల సౌకర్యం మేరకు క్యూలు, బారికేడ్లు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఆమె తిరుపతిలోని టోకెన్లు జారీ కేంద్రాల్లోని కౌంటర్లను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుపతి, తిరుమలలోని కౌంటర్లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 16 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 54,180 మంది స్వామివారిని దర్శించుకోగా 17,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.20 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment